ePaper
Tuesday, September 8, 2026

తాతా మధు వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి: కత్తుల కోటి

దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలి.. లేకుంటే ఉద్యమం ఉధృతం చేస్తాం

నల్లగొండ: టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని, దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలని నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు కత్తుల కోటి డిమాండ్ చేశారు.

పీసీసీ, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదేశాల మేరకు నల్లగొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. దళితుల గౌరవాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని స్పష్టం చేశారు.

తాతా మధు వెంటనే క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో నల్లగొండ గడ్డపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. క్షమాపణ చెప్పకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి, ప్రజల ముందే ఆయన వైఖరిని ఎండగడతామని తెలిపారు.

దళితుల ఆత్మగౌరవం కోసం చివరి వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని కత్తుల కోటి స్పష్టం చేశారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!