ePaper
Saturday, April 11, 2026

నల్లగొండలో జ్యోతిబా పూలే ద్విశతాబ్ది వేడుకలు

మహాత్మ జ్యోతిబా పూలే ద్విశతాబ్ది ఉత్సవాలు నల్లగొండలో ఘనంగా నిర్వహించబడ్డాయి. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో క్లాక్ టవర్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సమానత్వం, సామాజిక న్యాయం, నాణ్యమైన విద్య కోసం పూలే చేసిన కృషి భావితరాలకు మార్గదర్శకమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని తెలిపారు.

విద్యార్థులకు ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్‌లు, వసతి గృహాల్లో సౌకర్యాల అభివృద్ధి, ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.

నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జ్యోతిబా పూలే మహిళా విద్య కోసం పోరాడిన మహానీయుడని పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ కుల వివక్షతకు వ్యతిరేకంగా పూలే చేసిన పోరాటం సమాజానికి మార్గదర్శకమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!