ePaper
Sunday, April 5, 2026

అరకు, పాడేరు ప్రాంతాల్లో భూకంపం

ఆంధ్రప్రదేశ్‌లోని అరకు లోయ (ఆంధ్ర ఊటీ)తో పాటు పాడేరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి.

శనివారం రాత్రి 11:31 గంటల సమయంలో భూమి కంపించగా, ప్రకంపనలు కొన్ని సెకన్ల పాటు కొనసాగాయి. ఈ ప్రభావంతో ఇళ్లలోని సామాన్లు కదిలి, కొన్ని చోట్ల చెల్లాచెదురుగా పడిపోయాయి.

ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.

ప్రస్తుతం ఎలాంటి ప్రాణనష్టం లేదా భారీ నష్టం జరిగినట్లు సమాచారం లేదు. అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!