నల్లగొండ జిల్లా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గజ్వేల్‌లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు.
నకిరేకల్‌లో విలేఖరులతో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ గూండాలు పిరికిపంద దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పిందని, కాంగ్రెస్ నాయకుల అరాచకాలకు అడ్డుకట్ట లేకుండా పోయిందన్నారు.
గత రెండేళ్లుగా కాంగ్రెస్ నాయకులు వివిధ రూపాల్లో గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ సొంత నియోజకవర్గంలోనే క్యాంప్ కార్యాలయంపై దాడి జరగడం తీవ్ర ఆందోళన కలిగించే విషయం అన్నారు.
పోలీసులు కూడా కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తూ, ఇలాంటి చర్యలు దుర్మార్గమన్నారు.
ఇలాంటి దాడులకు బీఆర్ఎస్ పార్టీ భయపడదని, ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
ప్రజలు ఈ సంఘటనలను గమనిస్తున్నారని, కాంగ్రెస్‌ను రాష్ట్రం నుంచి తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments