తేదీ 03.04.2026 ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 3.00 గంటల వరకు సెంటినరీ సెల్ఫ్ సపోర్టింగ్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్‌లో శుభ శుక్రవారపు ఆరాధన ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా యేసుక్రీస్తు పలికిన చివరి ఏడు మాటల గూర్చి బోధకులు విశదీకరించారు. ఈ బోధనలు విశ్వాసుల్లో ఆధ్యాత్మిక చైతన్యం నింపాయి.
ఈ కార్యక్రమం కమిటీ సభ్యులు శ్రీ సేవారత్న డా. టి.యస్. క్రిస్టోఫర్ అధ్యక్షతన, ఐ. మాణిక్యం, యస్. ఆనంద్ ప్రసాద్, డి. కృపానందం, పి. అబషాలోమ్, వై. దాస్, ఏ. ఆశయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.
జి. ఎలిజబెత్ నాగేశ్వర్ రావు, కె. దేవరాజ్, డి. రూతమ్మ, ఎ. ఆనంద్, డి. జెరూష కృపానందం, కె. చంద్రశేఖర్, ఎస్. కుమారి రూఫుస్ వాక్యం బోధించారు.
రెవ. డా. బంక ప్రవీణ్ కుమార్ సంఘ కాపరి గారి ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమం మధ్యాహ్నం 3.30 గంటలకు ముగిసింది.

Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments