ePaper
Friday, April 3, 2026

నల్గొండలో భక్తి శ్రద్ధల మధ్య గుడ్ ఫ్రైడే వేడుకలు

నల్గొండ పట్టణంలో క్రైస్తవ సోదరులు గుడ్ ఫ్రైడేను భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

దేవరకొండ రోడ్‌లోని మరియా రాణి కేథడ్రల్ చర్చి నుండి మరియగిరి కొండ వరకు నిర్వహించిన ర్యాలీలో యేసు క్రీస్తును సిలువ వేయించిన విధానాన్ని కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు.

ఈ సందర్భంగా బిషప్ ధమన్ కుమార్ మాట్లాడుతూ క్రీస్తు ఈ లోకాన్ని రక్షించడానికి మానవ రూపంలో జన్మించాడని తెలిపారు. ప్రజలందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో విచారణ గురువు బాలస్వామి, ఫాదర్లు జీవన్, కిరణ్ రాజ్, కౌన్సిల్ సభ్యులు దాసరి శౌరి రాజు, ప్రేమ్ కుమార్, సామా మరయ, శౌరయ్య, మల్లారెడ్డి, రజనీకాంత్, జయప్రకాష్, రాజశేఖర్, గాలి జోడి, బాల, జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!