ePaper
Friday, April 3, 2026

నల్లగొండలో గ్రాండ్ హోటల్ ప్రారంభం… టూరిజం అభివృద్ధిపై గవర్నర్ పిలుపు

నల్లగొండ పట్టణ అభివృద్ధి దిశగా టూరిజం రంగాన్ని బలోపేతం చేయాలని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు.

పట్టణంలో అత్యున్నత ప్రమాణాలతో నిర్మించిన “శ్రీ వెంకట రమణ గ్రాండ్” హోటల్‌ను గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి మాట్లాడుతూ, నల్లగొండ నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో పర్యాటకులు, స్థానికులకు నాణ్యమైన వసతి, రుచికరమైన భోజనం అందించే ఇలాంటి హోటళ్లు ప్రారంభం కావడం శుభపరిణామమన్నారు.

అత్యాధునిక సదుపాయాలతో హోటల్‌ను ఏర్పాటు చేసిన మేనేజ్‌మెంట్ బృందాన్ని అభినందించారు. ఈ సంస్థ వ్యాపారపరంగా విజయవంతం కావాలని, నిర్వాహకులు రామేశ్వరరావు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, కుటుంబ సభ్యులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!