నల్లగొండ జిల్లాలో రైతు సమస్యల పరిష్కారం కోసం బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు మెమోరాండం సమర్పించారు. కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు గడ్డం వెంకట్ రెడ్డి నాయకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతు భరోసా పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న రైతు భరోసా డబ్బులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే వరి కోతలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏప్రిల్ నెలలోనే ఐకేపీ (IKP) సెంటర్లు ప్రారంభించాలని, రైతులకు ఇవ్వాల్సిన బోనస్ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు.
ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, అలాగే విబిజి రామ్‌జీ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వా లక్ష్మీ నర్సయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, జాతీయ నాయకులు, రాష్ట్ర, జిల్లా నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments