ePaper
Thursday, March 19, 2026

రామగిరి దేవాలయంలో ఉగాది పంచాంగ శ్రవణం

ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని నల్గొండ పట్టణంలోని రామగిరి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయంలో భక్తులతో కళకళలాడుతూ వేద మంత్రాల నడుమ పంచాంగ శ్రవణం జరిగింది. రాబోయే సంవత్సరానికి సంబంధించిన శుభాశుభ సూచనలను అర్చకులు వివరించారు.

ఈ కార్యక్రమంలో 48వ డివిజన్ కార్పొరేటర్ యామ కవితా దయాకర్, అర్చకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!