ePaper
Sunday, March 15, 2026

మార్చి 22న రైతు భరోసా తొలి విడత నిధుల విడుదల

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద తొలి విడత నిధులను మార్చి 22న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా నర్మెట్ట వేదికగా ఈ నిధులను అధికారికంగా విడుదల చేయనున్నారు.

నిధుల విడుదలపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతులకు నిధులు సమయానికి చేరేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వం తొలి దశలో ఒక ఎకరం వరకు భూమి ఉన్న 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో ₹3,590 కోట్లు జమ చేయనుంది.

రెండవ దశలో మరో 20 రోజుల వ్యవధిలో ₹2,650 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

అలాగే ఏప్రిల్ నెల చివరి నాటికి మూడవ విడత నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మొత్తంగా మూడు దశల్లో కలిపి ₹9,000 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రైతులకు ఆర్థిక భరోసా కల్పించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!