పదవ తరగతి పరీక్షలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా సవ్యంగా నిర్వహించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శనివారం ప్రారంభమైన పదవ తరగతి పరీక్షల సందర్భంగా జిల్లా కేంద్రంలోని పలు పరీక్షా కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు.
నల్గొండ పట్టణంలోని సెయింట్ ఆల్ఫాన్స్ పాఠశాల, నల్గొండ మండలం దోమలపల్లి జెడ్పిహెచ్ఎస్, మునుగోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు, గైర్హాజరు వివరాలను సంబంధిత పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లను అడిగి తెలుసుకున్నారు.
అన్ని పరీక్షా కేంద్రాల వద్ద తాగునీటి సదుపాయం ఉండేలా చూడాలని, వేసవి తీవ్రత దృష్ట్యా కుండలలో చల్లటి నీరు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే టాయిలెట్లు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని సూచించారు.
విద్యార్థులను ప్రధాన గేటు వద్ద పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే పరీక్షా కేంద్రంలోకి అనుమతించాలని చెప్పారు. ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాలను పోలీస్ భద్రతతో డిపాజిట్ చేయాలని అధికారులకు సూచించారు.
పరీక్షా కేంద్రాల వద్ద గట్టి భద్రత ఏర్పాటు చేసి, ఇతరులు కేంద్రాల్లోకి ప్రవేశించకుండా చూడాలని అన్నారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో జీరోక్స్ కేంద్రాలు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, పరీక్షల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని కలెక్టర్ స్పష్టం చేశారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments