ePaper
Saturday, March 14, 2026

నల్గొండలో ఏఐఎంఐఎం ఆధ్వర్యంలో ఘనంగా దావత్-ఏ-ఇఫ్తార్

నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రకాశం బజార్ తాలూకు దారి మసీదులో ఆల్ ఇండియా మజ్లిస్-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ ఆధ్వర్యంలో దావత్-ఏ-ఇఫ్తార్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ ఎమ్మెల్సీ మీర్జా రియాజుల్ హసన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన రంజాన్ మాసం ప్రాముఖ్యతను వివరించి, సోదరభావం, సామరస్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ముస్లిం సోదరులు ఉపవాస దీక్ష ద్వారా ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుకోవడం ఎంతో గొప్ప సంప్రదాయమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాల ఏఐఎంఐఎం ఇంచార్జ్ మరియు యాక్టివ్ మెంబర్ సయ్యద్ అలీమ్, హైదరాబాద్ మాజీ కార్పొరేటర్ ముర్తుజ, ఏఐఎంఐఎం జిల్లా అధ్యక్షుడు రజియోద్దీన్ అడ్వకేట్, సీనియర్ ఏఐఎంఐఎం మాజీ కౌన్సిలర్ హాషం సాబ్, ఏఐఎంఐఎం కార్పొరేటర్లు రఫీ ఉద్దీన్ హాజీ, సమీయుద్దీన్ నదీమ్, మొయినుద్దీన్ మొయినా, అబ్దుల్ మాలిక్ (జనరల్ సెక్రటరీ), ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ యాక్టివ్ మెంబర్ మొహమ్మద్ అలీ, 22వ వార్డు ఇంచార్జ్ మహమ్మద్ హుస్సేన్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొని సామూహికంగా ఇఫ్తార్ చేసుకున్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!