ePaper
Monday, March 9, 2026

ఎంవీఆర్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో తల్లిదండ్రులకు పాదపూజ మహోత్సవం

నల్గొండ: ఎంవీఆర్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులు తమ తల్లిదండ్రులకు పాదపూజ చేసే కార్యక్రమాన్ని నల్గొండలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ పాదపూజ మహోత్సవాన్ని ఈసారి 9వ సారి నిర్వహించడం విశేషం.

ఈ కార్యక్రమానికి నల్గొండ నగర మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే గుమ్మల మోహన్ రెడ్డి, పీఏ మధుసూదన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంవీఆర్ విద్యా సంస్థల చైర్మన్ కొలనుపాక రవికుమార్ మాట్లాడుతూ నేటి సమాజంలో మారుతున్న విద్యార్థుల ధోరణిని సక్రమ మార్గంలో నడిపించి తల్లిదండ్రుల పట్ల గౌరవం పెంపొందించడం, కుటుంబ బాంధవ్యాలను బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. నల్గొండలో మొట్టమొదటిసారిగా తల్లిదండ్రులకు పాదపూజ కార్యక్రమాన్ని ఎంవీఆర్ విద్యా సంస్థలే ప్రారంభించాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సుమారు 800 మంది విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన అందరికీ భోజన ఏర్పాట్లు చేయడంతో పాటు తాంబూలాలు మరియు నూతన వస్త్రాలు అందజేసి సత్కరించారు.

ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ శ్రీమతి గీత రవికుమార్, ప్రిన్సిపాల్ మేరెడ్డి రఘునందన్ రెడ్డి, ఉపాధ్యాయులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!