ePaper
Monday, March 9, 2026

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా TPUS మహిళా ఉపాధ్యాయులకు సన్మానం

నల్గొండ: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్గొండ పట్టణంలోని TPUS కార్యాలయంలో మహిళా ఉపాధ్యాయులను గౌరవిస్తూ నాగం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించి, స్మారక షీల్డులను అందజేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, నాగం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి హాజరయ్యారు. మహిళా ఉపాధ్యాయుల సేవలను ప్రశంసిస్తూ వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో TPUS జిల్లా అధ్యక్షులు భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డా. నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తిలో మహిళలు సమాజానికి మంచి మార్గదర్శకులుగా నిలుస్తున్నారని తెలిపారు. మహిళా శక్తి సమాజ అభివృద్ధికి మూలాధారమని, వారి సేవలు అమూల్యమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు పార్టీ నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!