ePaper
Saturday, March 7, 2026

మహిళా సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు: జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్

మహిళా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని, వాటిని సద్వినియోగం చేసుకొని మహిళలు సాధికారత సాధించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు.

శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని టి.ఎన్.జి.ఓ భవన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ గత దశాబ్ద కాలంలో మహిళల్లో ఎంతో మార్పు వచ్చిందని తెలిపారు. సాంకేతికత, విద్య, నైపుణ్యాల అభివృద్ధితో మహిళలు వివిధ రంగాల్లో గణనీయమైన పురోగతి సాధిస్తున్నారని చెప్పారు. మహిళల సంక్షేమం, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదని పేర్కొన్నారు.

ఈ పథకాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా, సామాజికంగా మరింత ముందుకు రావాలని ఆకాంక్షించారు. అలాగే సుధా మూర్తి వంటి మహిళా ప్రముఖులను ఆదర్శంగా తీసుకొని జీవితంలో ముందుకు సాగాలని మహిళలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది మరియు పలువురు మహిళలు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!