ePaper
Saturday, March 7, 2026

శ్రీలంక పర్యటనకు ఎంపికైన నల్లగొండ యువ క్రికెటర్లు – అభినందనలు వెల్లువ

నల్లగొండ జిల్లా క్రికెట్‌కు గర్వకారణమైన సంఘటన చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా క్రికెట్ సంఘానికి చెందిన యువ క్రీడాకారులు ఎస్‌కే అబ్దుల్ జీషాన్ మరియు బి భరత్ రెడ్డి లు శ్రీలంకలో జరగనున్న క్రికెట్ పర్యటనకు ఎంపికయ్యారు.

జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ పర్యటనకు ఎంపిక కావడం నల్లగొండ జిల్లాకు గర్వకారణమని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. కష్టపడి సాధన చేసిన ఈ ఇద్దరు క్రీడాకారులు ఈ అవకాశాన్ని అందుకోవడం యువ క్రీడాకారులకు ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు.

ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి ఇద్దరు క్రీడాకారులను హృదయపూర్వకంగా అభినందించారు. వారి పట్టుదల, కృషి మరియు ప్రతిభ వల్లే ఈ అవకాశం లభించిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా వారు మరింత మెరుగైన ప్రదర్శన కనబరిచి నల్లగొండ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

అలాగే జిల్లా క్రికెట్ సంఘం సభ్యులు, కోచ్‌లు, క్రీడాకారులు మరియు క్రీడాభిమానులు అబ్దుల్ జీషాన్ మరియు భరత్ రెడ్డిలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి భవిష్యత్తు మరింత उज్వలంగా ఉండాలని ఆకాంక్షించారు.

ఈ విజయంతో నల్లగొండ జిల్లాలో క్రికెట్ క్రీడకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని క్రీడా వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!