ePaper
Monday, March 2, 2026

నల్లగొండలో రోడ్ల పనులపై మంత్రి కఠిన ఆదేశాలు

నల్గొండ జిల్లాలో కొనసాగుతున్న రహదారి అభివృద్ధి పనులపై రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. ఇందిరాభవన్‌లో ఆర్ & బీ అధికారులతో సమావేశమై పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న బుద్ధారం, అప్పాజిపేట, బ్రాహ్మణవెల్లంల రహదారులను రెండు నెలల్లో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. సోమనవాగు–పగిడిమర్రి వంతెన నిర్మాణాన్ని మూడు నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.

కనగల్ జంక్షన్ నుంచి కనగల్ వరకు నాలుగు లేన్ల రహదారి పనులను తక్షణమే ప్రారంభించాలని అధికారులకు స్పష్టం చేశారు. అలాగే కనగల్–తిమ్మన్నగూడెం రహదారి పనులను వేగవంతం చేయాలని సూచించారు. మామిడాల గ్రామంలో సీసీ రోడ్ పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.

నార్కెట్‌పల్లి–మండ్ర రహదారి పనులు ఆలస్యం అయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. వైటీపీఎస్ రహదారి పురోగతిపై ప్రత్యేకంగా సమీక్షించి గడువులో పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!