ప్రభుత్వానికి చెందిన ధాన్యాన్ని అక్రమంగా విక్రయించి సుమారు రూ.43 కోట్ల మేర నష్టం కలిగించిన ప్రధాన నిందితులను నల్లగొండ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును Telangana State Civil Supplies Corporation Limited (TGSCSCL) నల్గొండ జిల్లా మేనేజర్ గారి ఫిర్యాదు మేరకు నమోదు చేయడం జరిగింది.
ఈ కేసును జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కె.శివరాం రెడ్డి, SDPO, నల్గొండ గారి పర్యవేక్షణలో మూడు ప్రత్యేక బృందాలు విచారణ చేపట్టి, 25.02.2026 తేదీన ఉదయం 11:00 గంటలకు నల్గొండ మండలంలోని దోమలపల్లి గ్రామ శివారులో నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టు చేసిన నిందితుల వివరాలు
1) కందుకూరి మహేందర్ (తండ్రి: లింగయ్య), వయస్సు: 65 సంవత్సరాలు, వృత్తి: వ్యాపారం, నివాసం: రవీంద్ర నగర్, నల్గొండ పట్టణం.
2) కందుకూరి పద్మ (భర్త: మహేందర్), వయస్సు: 57 సంవత్సరాలు, వృత్తి: వ్యాపారం, నివాసం: రవీంద్ర నగర్, నల్గొండ పట్టణం.
పరారీలో ఉన్న నిందితులు
1).మాశెట్టి రాధా కృష్ణ
2).మేడమ్ కృష్ణమూర్తి
3).ఇడుకుళ్ళ దామోదర్
4).కందుకూరి రవి కుమార్
5).బూరుగు బాలకృష్ణ తదితరులు
స్వాధీనం చేసిన వస్తువులు
1) నగదు – రూ.1,09,000/-
2)మూడు సెల్ ఫోన్లు
3)బెలెనో కారు నం. TG-07-A-9927.
నేర విధానం (Modus Operandi)
పైన తెలిపిన నిందితులు 2022-23 రబీ సీజన్‌లో నిందితులు నల్గొండ జిల్లా మరియు పరిసర ప్రాంతాలలోని సుమాంజలి పార్ బాయిల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ – ఆర్జాలబావి, నల్గొండ. వరలక్ష్మి పార్ బాయిల్డ్ మిల్ – చిట్యాల మనోహర ఆగ్రో ఫుడ్ ప్రాడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ – మునుగోడు ప్రభుత్వానికి కస్టమ్ మిల్లింగ్ ఒప్పందం కుదుర్చుకున్నారు.
వీరిలో కందుకూరి మహేందర్ ప్రధాన పాత్రధారిగా వ్యవహరిస్తూ, ప్రభుత్వ ఏజెంట్/మర్చంట్‌గా రైతుల నుండి కనీస మద్దతు ధర (MSP) కింద IKP/PACS/DAO/NDCMS/FPOల ద్వారా కొనుగోలు చేసిన ప్యాడీకి సరిపడా బియ్యాన్ని ప్రభుత్వానికి అందించకుండా, కుట్రపూరితంగా ధాన్యాన్ని అక్రమంగా విక్రయించారు.
ఈ మూడు రైస్ మిల్లుల ద్వారా మొత్తం 13,170.061 మెట్రిక్ టన్నుల ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా విక్రయించి సుమారు రూ.43 కోట్ల నష్టం కలిగించినట్లు విచారణలో వెల్లడైంది.
వీటిలో
- సుమాంజలి మిల్ – సుమారు రూ.22 కోట్ల నష్టం
- వరలక్ష్మి మిల్ – సుమారు రూ.19.33 కోట్ల నష్టం
- మనోహర మిల్ – సుమారు రూ.1.47 కోట్ల నష్టం.
ఈ కేసులో నిందితులు నేరపూరిత నమ్మక ద్రోహానికి పాల్పడి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టినట్లు విచారణలో తెలిపగా వీరిపై నల్గొండ రూరల్,చిట్యాల, మునుగోడు పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదు చేసి రిమాండు కి పంపనైనది.
పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ కేసును నల్లగొండ డిఎస్పీ శివరాం రెడ్డి గారి పర్యవేక్షణలో దర్యాప్తులో పాల్గొన్న నల్గొండ II టౌన్ CI రాఘవరావు,నార్కట్‌పల్లి సీఐ నాగరాజు,నల్గొండ రూరల్ ఎస్. ఐ సైదాబాబు,మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ గారు అభినందించారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments