ePaper
Monday, March 2, 2026

పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ను ఈరోజు ఆయన కార్యాలయంలో బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి. చిరంజీవులు రచించిన “హిస్సా-ఇజ్జత్-హుకుమత్” పుస్తకాన్ని డైరెక్టర్ గారికి అందజేశారు.

ఈ కార్యక్రమంలో బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం నల్లగొండ జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ నేలపట్ల చంద్రశేఖర్ పాల్గొన్నారు. విద్యా రంగంలో సామాజిక న్యాయం, ప్రతినిధిత్వం వంటి అంశాలపై ఈ పుస్తకం విశేషంగా దృష్టి సారించినట్లు తెలిపారు.

డైరెక్టర్ నవీన్ నికోలస్ పుస్తకాన్ని స్వీకరించి, రచయితకు అభినందనలు తెలియజేశారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!