చౌటుప్పల్ పురపాలక సంఘం రెండో సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికల విధులకు హాజరయ్యే ప్రిసైడింగ్ అధికారులు (PO), సహాయ ప్రిసైడింగ్ అధికారులు (APO)లకు గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి రెవెన్యూ డివిజనల్ అధికారి (RDO) శేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మాస్టర్ ట్రైనర్స్ ఎం. నరేందర్ రెడ్డి, బి. దశరథ శిక్షణ అందించారు. మొత్తం 96 మంది ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.
శిక్షణలో భాగంగా పోలింగ్ రోజున పాటించాల్సిన నిబంధనలు, ఓటింగ్ ప్రక్రియ నిర్వహణ, అత్యవసర సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బ్యాలెట్ బాక్స్ సీలింగ్ వంటి అంశాలపై సమగ్రంగా అవగాహన కల్పించారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, శాంతియుతంగా నిర్వహించేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు.
సహాయ జిల్లా ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ జి. వెంకట్రాంరెడ్డి ఆధ్వర్యంలో ఈ శిక్షణ కొనసాగింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ఎన్నికల విధుల్లో అలసత్వం వహించరాదని ఆయన అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో వీరబాబు, ఎంఆర్వో శ్రీధర్ రెడ్డి, మున్సిపల్ మేనేజర్ ఈ. గురువారావు (MEO), మున్సిపల్ RO డి. అంజయ్య, సీనియర్ అసిస్టెంట్ రఘుపతి, సానిటరీ ఇన్స్పెక్టర్ హనుమాన్ ప్రసాద్, పర్యావరణ ఇంజనీర్ రేణు కుమార్ తదితర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments