ఫిబ్రవరి 7న ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి యాప్ ఆధారిత క్యాబ్ సేవల డ్రైవర్లు సమ్మెకు పిలుపునిచ్చారు. పెరుగుతున్న ఇంధన ధరలు, అధిక కమిషన్లు, తక్కువ ఆదాయం, ఇన్సూరెన్స్ మరియు సంక్షేమ పథకాలు లేనందుకు నిరసనగా ఈ సమ్మె చేపట్టనున్నట్లు డ్రైవర్ సంఘాలు ప్రకటించాయి.
డ్రైవర్ల డిమాండ్లలో ప్రధానంగా కమిషన్ తగ్గింపు, కనీస ఛార్జీల పెంపు, ప్రమాద బీమా, ఆరోగ్య భద్రత, యాప్‌లలో పారదర్శకత వంటి అంశాలు ఉన్నాయి. వీటిపై కంపెనీలు ఇప్పటివరకు స్పందించకపోవడంతో సమ్మెకు దిగుతున్నట్లు డ్రైవర్లు తెలిపారు.
ఈ సమ్మె కారణంగా హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా క్యాబ్ సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆఫీస్‌కు వెళ్లే ఉద్యోగులు, విమానాశ్రయ ప్రయాణికులు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను ముందుగానే చూసుకోవాలని సూచిస్తున్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments