చౌటుప్పల్: చౌటుప్పల్ మున్సిపాలిటీ కార్యాలయ ప్రాంగణంలో శనివారం 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జి. వెంకట్ రామ్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పట్టణ ప్రముఖులు, వివిధ రాజకీయ పక్షాల నాయకులు, మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి జాతీయ గీతాలాపన చేశారు.

అనంతరం కమిషనర్ మాట్లాడుతూ, డా. బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, బాధ్యతలను కల్పించిందని తెలిపారు. ఆ రాజ్యాంగ స్ఫూర్తితోనే మున్సిపల్ యంత్రాంగం ప్రజలకు సేవలందిస్తోందని పేర్కొన్నారు. చౌటుప్పల్ పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
పారిశుధ్యం, హరితహారం, మౌలిక సదుపాయాల కల్పనలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్న కమిషనర్, పౌర సేవలను మరింత వేగంగా, పారదర్శకంగా ప్రజలకు అందించడమే మున్సిపాలిటీ లక్ష్యమని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికైన సీనియర్ అసిస్టెంట్ చ. దీప, వార్డ్ ఆఫీసర్ కె. రామనారాయణమూర్తిలను ఆయన అభినందించారు.
అలాగే ప్లాస్టిక్ రహిత చౌటుప్పల్ నిర్మాణానికి ప్రతి పౌరుడు సహకరించాలని, తడి–పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, మాజీ వార్డు కౌన్సిలర్లు బాబా షరీఫ్, కొయ్యడ సైదులు, మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, ఆర్‌ఓ అంజయ్య, సీనియర్ అసిస్టెంట్ రఘుపతి, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు, పారిశుద్ధ్య సిబ్బంది, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments