మేడారం:
వన దేవతల జాతర సందర్భంగా మేడారం ప్రాంతంలో భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో కీలకమైన మహాగట్టం మొదటి ఘట్టంగా ఈరోజు సాయంత్రం కన్నెపల్లి నుంచి సారాలమ్మ గద్దెపైకి రానున్నారు.
ఈ నేపథ్యంలో అటు సంప్రదాయ పూజలు సజావుగా సాగేందుకు పూజారులు, ఇటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వివిధ శాఖల అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. గద్దెల వద్ద భక్తులు బంగారం సమర్పించేందుకు దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.
భక్తులకు సులభంగా, శాంతియుతంగా దర్శనం జరిగేలా పోలీసు, వాలంటీర్లు, రెవిన్యూ తదితర శాఖల అధికారులు సమన్వయంతో తమ విధులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, క్యూల నిర్వహణలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.
ఇంతకు ముందు జాతరతో పోలిస్తే ఈసారి దర్శనం చాలా వేగంగా పూర్తవుతోందని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చేసిన ముందస్తు ఏర్పాట్లు, మెరుగైన నిర్వహణ వల్ల జాతర ప్రశాంతంగా సాగుతోందని భక్తులు అభిప్రాయపడుతున్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments