– యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ డా. బి. ధర్మానాయక్
నల్లగొండ:
నల్లగొండ జిల్లా కేంద్రంలో త్వరలో డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ బి. ధర్మానాయక్ తెలిపారు.
శుక్రవారం నల్లగొండ రీజనల్ స్టడీ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ఆధ్వర్యంలో, రిజిస్ట్రార్ డా. ఎల్. విజయకృష్ణారెడ్డి, అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ డా. ఘంటా చక్రపాణి పర్యవేక్షణలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రీజనల్ స్టడీ సెంటర్లలో పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
యూనివర్సిటీ బహుళ జాతీయ సంస్థ టీసీఎస్ (TCS) కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. దేశంలోనే మొదటి డిజిటల్ యూనివర్సిటీగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గుర్తింపు పొందిందన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఈ యూనివర్సిటీ విద్యాభివృద్ధికి దోహదపడుతోందని తెలిపారు.
నిర్ధిష్ట ప్రణాళికతో ఎప్పటికప్పుడు కొత్త కోర్సులను ప్రవేశపెడుతూ విద్యార్థుల విద్యా అభివృద్ధికి తోడ్పడుతున్నట్లు పేర్కొన్నారు. అంబేద్కర్ యూనివర్సిటీలో విద్యనభ్యసించి రాజకీయ రంగంలో, ఉన్నత పరిపాలనా విభాగాల్లో స్థిరపడిన ప్రముఖులు ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి హాజరై ప్రస్తుత విద్యార్థులకు దిశానిర్దేశం చేయాలని ఆకాంక్షించారు.
సమ్మేళనం తేదీని త్వరలో ప్రకటిస్తామని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పూర్వ విద్యార్థులందరూ సహకరించాలని కోరారు.
ఈ సమావేశంలో నల్లగొండ రీజనల్ స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ డా. బొజ్జ అనిల్ కుమార్, ఉమెన్స్ కాలేజ్ కోఆర్డినేటర్ డా. రాజారామ్, పూర్వ విద్యార్థుల అసోసియేషన్ అధ్యక్షుడు సైదుబాబు తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments