*నల్గొండ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగిలి సునీత రావు గారు ప్రియదర్శిని ఉడాన్ శానిటరీ నాప్కిన్స్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినారు. ఈ కార్యక్రమం స్టేట్ జనరల్ సెక్రెటరీ దుబ్బ. సాత్విక ఆధ్వర్యంలో లైన్ వాడి బషీర్బాగ్ అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద జరిగింది

బాలికలకు, మహిళలకు ప్రియదర్శిని ఉడాన్ సానిటరీ నాప్కిన్స్ అందజేయడం జరిగింది
సునీత రావు గారు మాట్లాడుతూ విద్యార్థినీలకు మహిళలకు ఈ సానిటరీ నాప్కిన్స్ ప్రతినెల జిల్లా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో 200 మంది పిల్లలకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో బట్టలు ఉపయోగించడం వలన అనారోగ్య పరిస్థితి ఏర్పడి క్యాన్సర్ బారిన పడుతున్నారు యు ట్రస్ట్ కు సంబంధించిన లేనిపోని అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. కాబట్టి మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సానిటరీ నాప్కిన్స్ తయారుచేసి పేదవారికి ఇవ్వడం జరుగుతుందని ప్రతి ఒక్కరు సానిటరీ నాప్కిన్స్ ఉపయోగించుకోవాలని సునీత రావు అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి గారి సారధ్యంలో తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాలలో పెద్దపీట వేస్తుందని హర్షం వ్యక్తం చేశారు . మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం 200 యూనిట్లకు కరెంటు బిల్లు ఉచితం 500 కే గ్యాస్ సిలిండర్ మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను ఇవ్వడం మహిళా క్యాంటీన్లను మహిళలకు ఆర్టీసీ బస్సు డ్రైవర్లుగా ఓనర్లుగా నియమించడం మహిళల పేర్ల పైన పెట్రోల్ బంకులు సాంక్షన్ ఇవ్వడం ఎలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విధాలుగా మహిళలకు తెలంగాణ ప్రభుత్వం ద్వారా సహాయ సహకారాలు అందిస్తున్నామని సునీత రావు అన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments