రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ మరియు మార్గదర్శకాల ప్రకారం నల్గొండ మునిసిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల వారీగా ఫోటో ఎన్నికల జాబితాల (Final Photo Electoral Rolls) తుది ప్రచురణ పూర్తయినట్లు అధికారులు తెలిపారు.
ఈ ప్రక్రియ నల్గొండ మునిసిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ ఆధ్వర్యంలో, రెవెన్యూ అధికారి శివ రాం రెడ్డి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ కృష్ణవేణి, సంబంధిత వార్డు అధికారులు పాల్గొని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిర్ణీత షెడ్యూల్‌కు అనుగుణంగా పూర్తిగా పారదర్శకంగా నిర్వహించబడింది.
తుది ఓటర్ల జాబితాలను ప్రజల పరిశీలనార్థం
జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఆర్‌డీఓ కార్యాలయం ఎంఆర్ఓ కార్యాలయం నల్గొండ మునిసిపల్ కార్యాలయం
లో ప్రచురించడం జరిగింది.
అర్హత కలిగిన ప్రతి ఓటరు తమ పేరు మరియు వివరాలు జాబితాలో సరిగా నమోదయ్యాయో లేదో పరిశీలించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో ఓటరు నమోదు కీలక పాత్ర పోషిస్తుందని వారు పేర్కొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments