ప్రణామ్ వయోవృద్ధుల డే కేర్ సెంటర్ ను గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంతి వర్యులు రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు, ఎస్.సి. మరియు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్, వికలాంగుల కాపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య, ప్రిన్సిపల్ సెక్రటరీ అనిత రామచంద్రన్ గారు, డైరెక్టర్ శైలజ వర్చువల్ గా, ప్రారంభించడం జరిగింది నల్లగొండ జిల్లా నందు జిల్లా నందు శ్రీ బడుగు చంద్రశేఖర్ ఐఏఎస్ గారు నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో వయో వయోవృద్ధులు ఒంటరి తనంతో బాధపడుతున్నారని, మానసికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, అలాంటి వారికి కాలక్షేపం కొరకు డే కేర్ సెంటర్ నిర్వహించడం హర్షించదగ్గ విషయమని, నల్లగొండ పట్టణంలో నడిబొడ్డున గల అటువంటి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బిల్డింగ్ నందు ఇక్కడ వినోదము కాలక్షేపము ఆటలు, వైద్య మరియు సలహా సూచనలు ఇవ్వడం ఎంతో ఉపయోగకరమని ఆయన అన్నారు. జిల్లా సంక్షేమ అధికారిని కెవి కృష్ణవేణి గారు మాట్లాడుతూ డే కేర్ సెంటర్ ప్రతి రోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నడుస్తుందని, సీనియర్ సిటిజన్స్ కొరకు డే కేర్ సెంటర్ నందు టీవీ, ఇండోర్ గేమ్స్, లైబ్రెరీ, విశ్రాంతి తీసుకొనుటకు సౌకర్యాలు కల్పించామని, స్నాక్స్, పండ్లు అందించబడినని, వయో వృద్దులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని, ప్రణామ్ వయో వృద్ధుల డే కేర్ సెంటర్ అరుణ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నల్గొండ వారిచే నిర్వహణ చేయబడుతుందని తెలిపారు స్వచ్ఛంద సంస్థ మరియు జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా నడపబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ కలర్ సొసైటీ ప్రెసిడెంట్ అమరేందర్ రెడ్డి గారు, గృహ నిర్మాణ సంస్థ పిడి రాజకుమార్ గారు సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లికార్జున్ గారు సుదర్శన్ రెడ్డి గారు సిడిపిఓ, నిర్మల గారు చంద్రకళ గారు ఆశ్రమంజుగారు కతీజా గారు , ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ మునగాల నాగిరెడ్డి, వెంకట్ రెడ్డి నవీన్ సద్దాం తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments