బి. చంద్రశేఖర్ జిల్లా అధికారులను ఆదేశించారు.
ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా సోమవారం ఆయన కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు .
ఫిర్యాదులను స్వీకరించిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పరిష్కరించిన ఫిర్యాదులకు ఆన్లైన్లోనే ఎండార్స్ మెంట్ ఇవ్వాలని ,ఒకవేళ ఏదైనా ఫిర్యాదు పరిష్కారం కానట్లయితే పరిశీలించి క్షేత్రస్థాయి నుండి రిపోర్టు తెప్పించి వెంటనే పరిష్కరించాలని చెప్పారు. జిల్లా అధికారులు, ఆర్డీవోలు, సబ్ కలెక్టర్ ప్రజావాణి ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ప్రజావాణి ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లు,తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నందున ప్రజావాణిలో ప్రత్యేకించి ఎప్పటికప్పుడే ఫిర్యాదుదారుకు సమాచారం చెప్పేలా డి ఆర్ డి ఓ, గృహ నిర్మాణ శాఖ పీడీలు లాప్టాప్ తో సహా ఒక మనిషిని ప్రజావాణిలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ప్రతి సోమవారం ముఖ్యమైన అంశాలు, నివేదికలు, పథకాల అమలు తదితర అంశాల పై ప్రజావాణి తర్వాత జిల్లా అధికారుల సమన్వయ సమావేశంలో సమీక్షించడం జరుగుతుందని, ఇందుకు సంబంధించిన సమాచారంతో జిల్లా అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు.
సర్పంచులకు శిక్షణ ఇచ్చేందుకుగాను జిల్లా కేంద్రంలో రెండు వేదికలను గుర్తించడం జరిగిందని, అలాగే వార్డు సభ్యులకు కూడా శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
మున్సిపాలిటీలలో ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితాకు సంబంధించి సంబంధిత మున్సిపల్ మండలాల ప్రత్యేక అధికారులు సమీక్షించి తనకు నివేదిక సమర్పించాలని తెలిపారు.
మండల ప్రత్యేక అధికారులు వసతి గృహాలను సందర్శించి నిర్దేశించిన ప్రొఫార్మ లో నివేదిక సమర్పించాలని, విద్యార్థులకు సంబంధించిన సమస్యలన్నీ అడిగి తెలుసుకుని పంపించాలన్నారు .
గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పదవ తరగతి పరీక్ష ఫలితాలు మెరుగు కావాలని చెప్పారు.
మండల స్థాయిలో మండల ప్రత్యేక అధికారులు ప్రత్యేక పాత్ర పోషించాలని కోరారు.
ముఖ్యమైన ప్రభుత్వ పథకాల పై ఎప్పటికప్పుడు సమీక్షించడం జరుగుతుందని, నెలకు ఒకసారి తహసిల్దార్లు, ఎంపీడీవోలతో విడివిడిగా సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అధికారులందరూ ప్రజావాణి కార్యక్రమానికి హాజరుకావాలని ఆయన కోరారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్, ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి, దేవరకొండ ఆర్ డి ఓ రమణారెడ్డి, చండూరు ఆర్డిఓ శ్రీదేవి, జిల్లా అధికారులు, ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సోమవారం 118 ఫిర్యాదులు స్వీకరించగా ,జిల్లా అధికారులకు 65,రెవిన్యూ అధికారులకు 53 ఫిర్యాదులు వచ్చాయి.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments