e-paper
Thursday, January 29, 2026

రబీ సీజన్ కి సంబంధించి యూరియా పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్ అన్నారు. ఈ రబీ సీజన్లో రైతులకు యూరియా సరఫరా, యూరియా పై ఏర్పాటు చేసిన “ఫర్టిలైజర్ బుకింగ్ యాప్” పై మంగళవారం ఉదయాదిత్య భవన్ లో ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమం మరియు సమావేశానికి హాజరయ్యారు. జిల్లాలో యూరియాకు ఎలాంటి కొరత లేదని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. యూరియా కోసం

రైతులు గతంలో లాగా క్యూ లైన్ లలో నిలబడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం తీసుకువచ్చిన “ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ” రైతులకు ఎంతో సౌకర్యంగా ఉందని తెలిపారు.ఈ యాప్ ద్వారా కూర్చున్న చోటు నుండే ఏ షాపులో ఎంత యూరియా అందుబాటులో ఉందో తెలుసుకోవచ్చని, అంతేకాక ఏ డీలర్ వద్ద ఎంత స్టాక్ ఉందో వెంటనే తెలిసిపోతుందని అన్నారు .ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ వల్ల యూరియా క్రమబద్దీకరణ సైతం చేసుకోవచ్చని ,అలాగే ఏ పంటకు ఎంత యూరియా వేయాలో కూడా యాప్ లో అందుబాటులో ఉందని, నల్గొండ జిల్లాలో ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ విజయవంతంగా నిర్వహిస్తున్నప్పటికీ ఈ యాప్ పై ఇంకా విస్తృత ప్రచారం చేయాలని చెప్పారు.రైతులు అనవసరంగా ఎక్కువ మొత్తంలో యూరియా వాడితే భూమి సారవంతం కోల్పోయి దిగుబడి తగ్గే అవకాశాలు ఉన్నాయని, ఈ విషయం రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు.
జిల్లాలో యూరియా పంపిణీని ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ స్థాయిలో పర్యవేక్షించడం జరుగుతున్నదని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ఫర్టిలైజర్ అమ్మకం కేంద్రాల వద్ద అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయాలని, షామియానా, తాగునీరు ఏర్పాటు చేయాలని, ప్రతి కేంద్రం లో కనీసం మూడు కౌంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఉదయం 6 గంటల నుండే యూరియా అమ్మకాలు ప్రారంభించాలని, యూరియా సరఫరా సక్రమంగా నిర్వహించేందుకు మండల, డివిజన్ స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని తెలిపారు.డీలర్ రైతులు యాప్ ద్వారా బుక్ చేసుకొన్న ఐడి నెంబర్ ఆధారంగా యూరియాను పంపిణీ చేయాలని, ఒకవేళ ఎవరైనా రైతు యాప్లో బుక్ చేసుకోకుండా నేరుగా ఫర్టిలైజర్ కేంద్రానికి వచ్చినట్లయితే రైతులకు సహకరించి యాప్ లో బుక్ చేసుకునే విధంగా చూడాలన్నారు. యూరియాను బ్లాక్ మార్కెటింగ్ చేయవద్దని, అవసరం ఉన్నంత మేరకే యూరియాను ఇవ్వాలని, ఇతర వినియోగాలకు యూరియా వాడినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, యూరియా కోసం రైతులు క్యూ లైన్లలో ఉండకుండా చూసుకోవాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆయన ఖరీఫ్ ధాన్యం సేకరణ పై సమీక్షించారు. జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, జిల్లా సహకార అధికారి పత్యానాయక్, దేవరకొండ ఆర్ డి ఓ రమణా రెడ్డి, పౌరసరఫరాల జిల్లా అధికారి వెంకటేష్, మార్క్ఫెడ్ డి ఎం జ్యోతి, వ్యవసాయ సహాయ సంచాలకులు, వ్యవసాయ అధికారులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సీఈవోలు, తహసిల్దార్లు, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు .



Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!