అర్చక ఉద్యోగ సంఘం నూతన కమిటీ ఎన్నిక.
రామానుజ చిన్న జీయర్ స్వామి.

భగవంతునికి భక్తునికి మధ్యన అర్చకులు సంధానకర్త వలె పని చేస్తారని అటువంటి అర్చకులకు అన్యాయం జరుగుతుందని రామానుజ చిన్న స్వామి అన్నారు. బుధవారం ధర్వేశిపురం లో జరిగిన అర్చక,ఉద్యోగుల సంఘం నూతన కమిటీ ఎన్నిక సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. దేవాదాయ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులతో సమానంగా అర్చకులు పనిచేస్తున్నప్పుడు సమాన వేతనం సమన్యాయం ఉండాలన్నారు. ప్రభుత్వం ధూప దీప నైవేద్యాలకు ఇచ్చే నిధులు సరిపోక అర్చకులు భక్తుల నుండి విరాళాలు సేకరించి ఆలయాల ఖర్చులకు వినియోగిస్తున్నారు. ప్రభుత్వం నియమించే అర్చకుల పోస్టులకు వేద పండితులను కాకుండా ఆగమశాస్త్ర పండితులను నియమించాలని వారినే ఇంటర్వ్యూ చేయాలని జీయర్ స్వామి ప్రభుత్వానికి సూచించారు, ఆలయాలు శాంతికి నిలయాలని నేడు సమాజంలో ప్రతి మనిషి అశాంతికి గురై ఆలయాలకు వస్తున్నారని అటువంటి వారికి అర్చకులు మానసిక ప్రశాంతత కలిగిస్తూ దైవారాధన భక్తుల సేవకు అంకితమై పని చేస్తున్నారని అటువంటి అర్చకులను ప్రభుత్వం ఆదరించాలన్నారు. నూతనంగా ఏర్పడిన అర్చక సంఘం అర్చకుల సమస్యల పరిష్కారానికి పనిచేయాలన్నారు. అనంతరం అర్చక ఉద్యోగుల సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అర్చక సంఘం ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా గాద ఉమామహేశ్వర శర్మ, నలగొండ ఉపాధ్యక్షులుగా శ్రీనివాసచార్యులు, మట్టపల్లి, మహంకాళి కిరణ్ శర్మ సూర్యాపేట, లహరి నరసింహాచార్యులు,సూర్య హుజూర్నగర్, బ్రాహ్మణపల్లి రవీందర్ శర్మ, జనగాం,ప్రధాన కార్యదర్శిగా జీడికంటి అనంత ఆచార్యులు మత్స్యగిరి, సంయుక్త కార్యదర్శిగా కంభంపాటి రమణ, కోశాధికారిగా కారంపూడి మోహన్ నల్గొండ,మంగళగిరి, ఫణికుమార్ ఆచార్యులు, సహాయ కార్యదర్శిగా వలివేలు, విద్యాధర శర్మ, సూర్యాపేట,హరీష్ శర్మ సూర్యాపేట,ముడుంబై దామోదరచార్యులు, అత్తాంశగోపాలచార్యులు, తోపాటు ఐదుగురిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఉద్యోగ సంఘం గౌరవాధ్యక్షులుగా జీనుకుంట్ల చంద్రయ్య, గౌరవ సలహాదారులుగా శ్రీమతి రాజ్యలక్ష్మి, ఉమ్మడి జిల్లా నల్గొండ అధ్యక్షులు అలుగుబెల్లి సత్తిరెడ్డి,ప్రధాన కార్యదర్శిగా మహేందర్ రెడ్డి, కోశాధికారిగా కె ఉపేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా ఎన్ అంజనేయులు,కొండారెడ్డి డి, శ్రీనివాస్,సమన్వయ సభ్యులుగా ఎన్ రమణ, గోవిందరెడ్డి,వీరయ్య, ప్రచార కార్యదర్శిగా ఎస్బివి యోగానందం, తోపాటు 12 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్ర శర్మ, అర్చక సంఘం జేఏసీ అధ్యక్షులు పరాశరం రవీంద్రాచార్యులు,ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు కృష్ణమాచారి, జేఏసీ కన్వీనర్ డివికే శర్మ,ఉద్యోగుల వెల్ఫేర్ కమిటీ మెంబర్ శ్రవణ్ కుమారా చార్యులు, జక్కాపురం నారాయణస్వామి, దిండిగల్ ఆనంద్ శర్మ,అర్చక సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు పెన్నా మోహన్ శర్మ, బండారు శ్రీనివాస్,అనిల్ కుమార్, ట్రిపుల జై శర్మ తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments