నల్గొండ:
టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రీ క్రిస్మస్ వేడుకలకు ఉద్యోగ సంఘ సభ్యులు, ఉద్యోగ మిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌కు చెందిన రెవరెండ్ డాక్టర్ శశికిరణ్ పులుకూరి ముఖ్య ప్రసంగికులుగా పాల్గొని దేవుని సందేశాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లాకు చెందిన పాస్టర్లు, బిషపులు అయిన రెవరెండ్ సమర్పణ, మోజెస్, రాజ్ కుమార్, ప్రభాకర్, జయచంద్ర, క్రీస్తు దాసు, ఐజాక్, యేసు రత్నం పాల్గొని పాటలు, ప్రార్థనలు, శుభాకాంక్షల ద్వారా దేవుని నామాన్ని ఘనపరిచారు.

ఈ కార్యక్రమాన్ని టీఎన్జీవోస్ జేఏసీ చైర్మన్ నాగిళ్ల మురళి, కార్యదర్శి శేఖర్ రెడ్డి సారధ్యంలో, టీఎన్జీవో జిల్లా కోశాధికారి మేడి జయరావు ఆధ్వర్యంలో నిర్వహించారు.
అలాగే అసోసియేట్ అధ్యక్షులు డీఐ రాజు, కొండమల్లేపల్లి యూనిట్ అధ్యక్షులు మనోజ్, ప్రదీప్, జైపాల్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీడీ రాజకుమార్ హాజరయ్యారు.
అదనంగా టీఎన్జీవో కేంద్ర సంఘ ఉపాధ్యక్షులు చేపూర్ నరసింహ చారి, కార్యవర్గ సభ్యులు వంగూరి విజయ్ కృష్ణ, ఉపాధ్యక్షులు దశరథ ఆంజనేయులు, జైపాల్, సంస్థాగత కార్యదర్శి వంగూరి భాస్కర్, సంయుక్త కార్యదర్శులు సైదుల్ నాయక్, శ్రీనివాస్, జహంగీర్, బాలకృష్ణ, రణధీర్, అమీరుద్దీన్, కార్యాలయ కార్యదర్శి షఫీ, మహిళా ఉపాధ్యక్షులు రమ్య సుధ, సంయుక్త కార్యదర్శులు సునీత, రిబ్కా, కర్ణ, కార్యవర్గ సభ్యులు బిక్షం, రవి నాయక్, సోమేశ్వరి, సంధ్య, నాలుగో తరగతి ఉద్యోగ సంఘ అధ్యక్షులు బిక్షమయ్యతో పాటు ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా క్రిస్మస్ సందేశాలతో కార్యక్రమం ఆధ్యాత్మికంగా, స్నేహపూర్వకంగా సాగిందని నిర్వాహకులు తెలిపారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments