సూర్యాపేట జిల్లా, కోదాడ మండలం:
పంచాయతీ ఎన్నికల్లో రాజకీయాల్లో రాణించాలనే ఆశతో ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసిన అభ్యర్థి చివరకు ఓటమి చవిచూశాడు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, ఎస్ఐ ఉద్యోగాన్ని వదిలి కాంగ్రెస్ పార్టీ తరఫున పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశారు.
ఈ ఎన్నికల్లో ఆయనకు కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ పద్మావతి మద్దతు లభించినప్పటికీ, ఫలితాల్లో ఓటమి తప్పలేదు. స్థానిక రాజకీయ సమీకరణలు, గ్రామస్థాయి అంశాలు ఆయనకు ప్రతికూలంగా మారినట్లు తెలుస్తోంది.
ఉద్యోగ భద్రతను త్యాగం చేసి రాజకీయాల్లోకి వచ్చిన వెంకటేశ్వర్ల ఓటమి ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల్లో ప్రజాభిమానమే కీలకమని ఈ ఫలితాలు మరోసారి నిరూపించాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments