ఇది ఓ ఎన్నిక కాదు, ఇది మన స్వాభిమాన పోరాటం! – బీసీ ఇంటలెక్చువల్ ఫోరం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దాలు గడుస్తున్నా గ్రామాల స్థాయిలో బీసీలు ఎక్కువ జనాభా ఉన్నప్పటికీ, నాయకత్వం మాత్రం ఇతర వర్గాల చేతుల్లోనే ఉందని ఇప్పుడు బీసీ సమాజం బలంగా గ్రహించాల్సిన సమయం వచ్చిందని బిసి ఇంటలెక్చువల్ ఫోరం జిల్లా కోఆర్డినేటర్ నేలపట్ల చంద్రశేఖర్ తెలిపారు.
ఈసారి జరుగుతున్న సర్పంచ్ ఎన్నికలు సాధారణ ఎన్నికలు కావు.
ఇవి బీసీలకు నాయకత్వం రావాలా? లేక బీసీలు ఓటుగా మాత్రమే మిగలాలా? అని నిర్ణయించే ఎన్నికలు
బీసీలు మెజారిటీగా ఉన్న గ్రామాల్లో అధిపత్య కులాలకు నాయకత్వం లభించడం చాలా ఏళ్లగ జరుగుతున్న అన్యాయం. ఇప్పుడు ఆ పరిస్థితి మార్చే సమయం వచ్చింది. అధికారం ఉన్న చోటే గౌరవం ఉంటుంది. అధిపత్య కులాలు ఓటు అడుగుతారు. చేతులు కలుపుతారు. మాటలు చెబుతారు.
కానీ ఓటు పొంది కుర్చీ ఎక్కిన తర్వాత బీసీలను /బహుజనులను పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకే ఈసారి ఓటు డబ్బుకు,సారాకు అమ్ముకునే వస్తువు కాదు, భవిష్యత్తును నిర్ణయించే ఆయుధం. ఆధిపత్య కులాలకు వేసే ప్రతి ఓటు మన బానిసత్వము పటిష్టత కు వేసే ఓటే గ్రామాలు బీసీలతో నిండివున్నప్పుడు… సర్పంచ్ కుర్చీలు కూడా బీసీల దే కావాలి
“మన గ్రామంలో మనమే మెజారిటీ…
కానీ అధికారం మాత్రం మన చేతుల్లో లేదు – ఇది మన తప్పు మనము చేస్తున్న పొరపాటు.” అందుకే
ఈసారి తెలంగాణా లో సర్పంచ్ అభ్యర్థులుగా బీసీ అభ్యర్థులనే గెలిపించండి. ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ ల సహకారం తో సర్పంచ్ సీట్లు గెలవండి ,బహుజన వాదాన్ని గెలిపించండి .
గౌరవం – హక్కు – హుకుమత్ (Power) మన చేతికి తీసుకురండి.
బీసీ ఓటు – బీసీ అభ్యర్థికే.
ఇది ఒక అభ్యర్థిని గెలిపించడం కాదు — బీసీల రాజకీయ భవిష్యత్తును నిర్మించడం. మన హక్కులు కొరకు ఆధిపత్య కులాలను యాచించ కుండా ఉండాలంటే , మన హక్కులు మన చేతుల్లో ఉండాలంటే… గ్రామ స్థాయిలోనే నాయకత్వం బీసీలకు / బహుజను లకు రావాలని తెలిపారు
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments