ePaper
Monday, March 16, 2026

హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’ ప్రారంభం – 5,000 మంది పోలీసు సిబ్బందితో భారీ డ్రైవ్

హైదరాబాద్, డిసెంబర్ 5, 2025:

నగరంలో శాంతిభద్రతలను మరింత బలోపేతం చేయడం కోసం హైదరాబాద్ సిటీ పోలీసులు డిసెంబర్ 5 రాత్రి 10 గంటల నుంచి ‘ఆపరేషన్ కవచ్’ పేరుతో విశాలమైన నాకాబందీ, తనిఖీల కార్యక్రమాన్ని ప్రారంభించారు.

శహరంతటా 5,000 మంది పోలీసు సిబ్బంది, 150 కి పైగా ప్రత్యేక టీమ్‌లు రాత్రంతా నాకాబందీ పాయింట్ల వద్ద ఇంటెన్సివ్ చెకింగ్ నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో లా & ఆర్డర్, ట్రాఫిక్, టాస్క్ ఫోర్స్, లాయన్ ఆర్డర్ రిజర్వ్, క్రైమ్ కో-ఆర్డినేషన్ వింగ్స్ సంయుక్తంగా పాల్గొంటున్నాయి.

పోలీసు కమిషనర్ సి.వి. ఆనంద్ పేర్కొన్న విధంగా,

ఈ ప్రత్యేక డ్రైవ్‌తో నగరంలో నేరాల నిరోధం, శాంతిభద్రతల కాపాడటం ముఖ్య లక్ష్యం.

పోలీసుల పూర్తి సహకారంతో నగరవాసులు ఈ డ్రైవ్‌ను సమర్థవంతంగా నిర్వహించేందుకు ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు వెంటనే సమాచారమివ్వాలని ప్రజలకు సూచించారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!