కన్నుల పండుగగా అయ్యప్ప స్వామి అభిషేకం, మహా పడిపూజ!
నల్లగొండ పట్టణం ఎస్ఎల్ఎన్ కాలనీ లోని వెన్నెల సారీస్ జువెలరీస్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి వారికి మహా అభిషేకం,మహా పడిపూజ అత్యంత వైభవంగా, కన్నుల పండుగగా జరిగాయి. స్వామివారికి సమర్పించిన పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, గంధం, వివిధ రకాల పండ్ల రసాలతో అయ్యప్ప స్వామివారి మూలవిరాట్టుకు శాస్త్రోక్తంగా అభిషేకం చేశారు. అభిషేకం జరుగుతున్నంత సేపు భక్తులు “స్వామియే శరణం అయ్యప్ప” అంటూ భక్తి పారవశ్యంతో భజనలు చేశారు. భక్తులలో ఆధ్యాత్మిక అనుభూతిని నింపింది. ప్రత్యేకంగా అలంకరించిన 18 పవిత్ర మెట్లకు (పడి) మహా పడిపూజ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగింది. ఈ పూజా కార్యక్రమాన్ని మేడం విశ్వ ప్రసాద్ గురు స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న మాలధారులు, భక్తులుఈ పడిపూజలో ఉత్సాహంగా పాల్గొని నృత్యాలు చేశారు. రంగురంగుల పుష్పాలు, దీపాలతో అలంకరించబడిన పడిని చూడటం భక్తులకు కన్నుల పండుగగా అనిపించింది.
నిర్వాహకులు చొక్కారపు వెంకటేశ్వర్లు, మాధవి,సాయి నిఖిల్, వెన్నెల, లక్షమమ్మ, స్వామివారి సేవలో పాల్గొనడం తమ అదృష్టంగా భావిస్తున్నామని వారు తెలిపారు. అనంతరం భక్తులందరికీ మహా ప్రసాద వి జరిగింది. ఈ కార్యక్రమంలోవినోద్, ప్రీతీ, నిర్మల, దేవేందర్,పుష్ప, ఆంజనేయులు, సముద్రాల కుమార్, రాములమ్మ, శ్రీధర్, పద్మ, ప్రభ, వేణు,భాను, సురేష్, మమత, కవిత, భవాని, సరిత, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments