నల్గొండ:
నల్గొండ జిల్లా బీసీ జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కుల సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన బీసీ నాయకుల సమావేశంలో బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని గట్టిగా డిమాండ్ చేశారు.
ఈ సందర్భంలో బీసీ జేఏసీ చైర్మన్ మున్నాస ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, దేశంలో ప్రస్తుతం ఉన్న 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేసేందుకు రాజ్యాంగ సవరణ అవసరమని, ఇందుకోసం కాంగ్రెస్స్, బీజేపీలు చిత్తశుద్ధితో పార్లమెంట్‌లో బిల్లును ఆమోదింపచేయాలని కోరారు. లేదంటే, ఆయా పార్టీలను బీసీ వ్యతిరేక పార్టీలుగా ప్రకటిస్తామని హెచ్చరించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలపక్ష ప్రతినిధులతో కలిసి ఢిల్లీకి వెళ్లి, రేపు జరగబోయే పార్లమెంట్ సమావేశంలో బీసీ బిల్లును ప్రవేశపెట్టి, 9వ షెడ్యూల్‌లో చేర్చాలని కోరారు. బీసీల జనాభా ఎంతైతే, అంత రిజర్వేషన్ ఇవ్వాల్సిందేనని, సాధించేంతవరకు ఉద్యమాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో కొనసాగిస్తామని తెలిపారు. ఈ ఉద్యమం ఆత్మగౌరవం కోసం, అవమానాలకు వ్యతిరేకంగా సాగుతుందని చెప్పారు.
ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత హైకోర్టు ఎన్నికల ప్రక్రియను నిలిపివేయడం దురదృష్టకరమని, ఇది రాష్ట్రంలోని 56 శాతం బీసీ ప్రజల హక్కులను దెబ్బతీసే నిర్ణయం అని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని 243(డి)6 షెడ్యూల్ ప్రకారం రాష్ట్రాలకు రిజర్వేషన్లు పెంచుకునే అధికారం ఉందని పేర్కొన్నారు.
“బీసీలు ఎంత ఉన్నారో, వారికి అంత రిజర్వేషన్ ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి” అని డిమాండ్ చేశారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు మద్దతుగా ఏకమయ్యాలని పిలుపునిచ్చారు.
సమావేశం అనంతరం కొత్తగా ఎన్నికైన చైర్మన్ మున్నాస ప్రసన్నకుమార్ గారికి, నూతన జిల్లా కార్యవర్గానికి సన్మానం చేసి అభినందించారు.
ఈ సమావేశంలో అధ్యక్షత వహించిన దుడుకు లక్ష్మీనారాయణ, బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు చీర పంకజ్ యాదవ్, కొలగాని పర్వతాలు, గుంటోజు వెంకటాచారి, సలహాదారులు చిలకరాజు చెన్నయ్య, మిర్యాల యదగిరి, విద్యార్థి JAC జిల్లా చైర్మన్ అయితగోని జనార్దన్ గౌడ్, మైనారిటీ JAC చైర్మన్ అబ్దుల్ ఖదీర్, ప్రధాన కార్యదర్శి గజ్జి అజయ్ యాదవ్, వైస్ చైర్మన్లు, కోఆర్డినేటర్లు, కన్వీనర్లు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments