తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం-నల్లగొండ & సూర్యాపేట జిల్లాల నూతన కార్యవర్గం 5Gఎన్నిక గురించి జరిగిన ఎన్నికలలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి స్థానాలకు పోటీలో ఎవరూ లేకపోవటంతో సభ్యులందరి ఆమోదముతో ఏకగ్రీవంగా అధ్యక్షులు గా శ్రీ నల్ల శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి గా శ్రీ యేశాల విశ్వ కుమార్ ఎన్నికైనట్లు జిల్లా ఎన్నికల అధికారి శ్రీ గంజి వెంకట శ్రీనివాస్ ప్రకటించారు.
ఎన్నికైన నూతన కార్యవర్గం మూడు సంవత్సరాలు పనిచేస్తుందని తెలిపినారు. ఎన్నికైన కార్యవర్గ సభ్యులు :
అధ్యక్షులు : నల్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి : యేశాల విశ్వ కుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్ : చిలుకూరి వెంకటేశం, కోశాధికారి : పున్న వేణుగోపాల్, ఉపాధ్యక్షులు : మిర్యాల వేంకటపతి, రాపోలు రవి, ఆనందపు సత్యనారాయణ, బీమనపల్లి దుర్గయ్య, పొట్టబత్తుల జ్యోతి, మిర్యాల సుధాకర్. సహాయక కార్యదర్శి : వేషాల శ్రీదేవి, గంజి నారాయణ, యేశాల శివ, గంజి వెంకన్న, గోషిక శివ కుమార్, గంజి ధనుంజయ, చేరిపల్లి శ్రీనివాస్. ప్రచార కార్యదర్శి : గంజి నవీన్ కుమార్, ఆర్గనైజేషన్ సెక్రెటరీ : తిరందాసు సంతోష్ కుమార్ , దొంత దామోదర్, గంజి ఉపేందర్, పగిడిమర్రి శివ కుమార్, దునుక జగదీశ్వర్, జెల్ల ఉమ. కార్యవర్గ సభ్యులు : జల్ద శ్రీనివాస్, కొంగరి పాండు, ఏలే శ్రీనివాస్, సామల సురేంద్ర బాబు, కోడి నరసింహ స్వామి, గుర్రం శ్రీనివాస్ , ముగ్గు రవి కిరణ్, దేవులపల్లి రవి. మ్యారేజ్ బ్యూరో కన్వీనర్ : పెండెం వెంకటేశ్వర్లు, మ్యారేజ్ బ్యూరో కో కన్వీనర్ : చిలుకూరి గోవర్ధన్.
నూతన కార్యవర్గ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర పద్మశాలి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఈగ వెంకటేశ్వర్లు , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరందాసు యాదగిరి , రాష్ట్ర సంస్థాగత కార్యదర్శి శ్రీ తిరందాసు యాదగిరేందర్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ గంజి వెంకట శ్రీనివాస్ , పొట్టబత్తుల శ్రీనివాస్ మరియు పద్మశాలి ఉద్యోగులు తదితరులు శుభాకాంక్షలు తెలపడం జరిగింది.
ఆ మార్కండేయ స్వామి వారి ఆశీస్సులతో ఈ సంఘ అభివృద్ధి కి మరియు పద్మశాలీల అభివృద్ధికి మనవంతు సహాయ సహకారాలు అందించాలి అని, మనము పూర్వము నిర్వహించినట్లే సేవా కార్యక్రమాలు ఇంకా విస్తృతముగా చెయ్యాలి అని, అన్ని శాఖలలో విధులు నిర్వహించే మన పద్మశాలీ ఉద్యోగులు అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలకు చేయూత అందించాలి అని, మన సంఘము ద్వారా నిర్వహించే వివాహ పరిచయ వేదికను అందరూ వినియోగించుకోవాలి అని ఈ సందర్భముగా తెలియచేశారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments