చదువు అలవాటుగా చేసుకుంటే ఆలోచన శక్తి, సృజనాత్మక పెరుగుతుందని, విద్యార్థులు కొంత సమయాన్ని పుస్తక పఠనం చేయడం వల్ల శాంతి, సహనం, చిత్తశుద్ధి అలవడుతుందన్నారు.
140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఇండస్ట్రీకి కావాల్సిన వస్తువులను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, మన దేశ పౌరులు బాగా చదువుకొని మన ఇండస్ట్రీలకు సంబంధించిన వస్తువులను మనమే తయారు చేసుకునే విధంగా తయారవ్వాలి అన్నారు.గ్రంథాలయంలో పుస్తక పఠనం వలన జ్ఞానం పెరుగుతుందని, తాను ఇదే గ్రంథాలయంలో మూడు సంవత్సరాలు పుస్తక పఠనం చేశానని తెలిపారు. రాతియుగం, చుక్కలు, చంద్రుడు, కథల పుస్తకాలు ,నవలలు చదివానని, విద్యార్థులు గ్రంథాలయంలో పుస్తకాలు చదివి ప్రయోజకులు కావాలని తెలిపారు .
అనంతరం ఆయన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ చైర్మన్ హఫీజ్ ఖాన్, కార్యదర్శి బాలమ్మ, డి.ఎస్.పి స్పెషల్ బ్రాంచ్ టి. మల్లారెడ్డి, ప్రభుత్వ బాలికల కళాశాల ప్రిన్సిపల్ సుధారాణి, బాలుర పాఠశాల ప్రిన్సిపాల్ యూసుఫ్ ఖాన్,ప్రతీక్ ఫౌండేషన్ చైర్మన్ గోనా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments