ePaper
Monday, March 16, 2026

చదువుతోనే అన్ని సాధ్యమవుతాయని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.

ఈనెల 14 నుండి 20 వరకు నిర్వహిస్తున్న 58 వ “జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో” భాగంగా బుధవారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ముందుగా జిల్లా కలెక్టర్ స్వర్గీయ భారత ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని ఏర్పాటుచేసిన ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం విద్యార్థినులనుద్దేశించి
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎంతో కష్టపడి ఇందిరాగాంధీ ప్రధాని అయ్యారని, పేద ప్రజల సంక్షేమానికి “గరీబి హఠావో” నినాదాన్ని తీసుకువచ్చారని, ఆమెకు అనేక భాషలలో ప్రావీన్యురాలని, తండ్రి జవహర్లాల్ నెహ్రూ ప్రధాని అయినప్పటికీ ఆమె స్వయంగా కష్టపడి ప్రధానమంత్రి అయ్యారని, ఇందిరాగాంధీ లాగా కష్టపడి చదివి సమాజంలో మంచి స్థానానికి రావాలని ఆమె విద్యార్థినిలకు పిలుపునిచ్చారు. చదువు ద్వారానే ఇవన్నీ సాధ్యమవుతాయని, ఏదైనా సాధించాలనే తపన, కోరిక ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని, చిన్నప్పుడు కష్టపడితే పెద్దయ్యాక సంతోషంగా ఉంటారని, గొప్ప ఆలోచనలు, కష్టాలు ఎదుర్కొనే మనస్తత్వం కలిగి ఉంటే తప్పనిసరిగా భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉంటారని అన్నారు. మనసుకు ఎంతో శక్తి ఉంటుందని, మనసులో ఏమనుకుంటే అది సాధ్యమవుతుందని తెలిపారు. జిల్లా గ్రంధాలయ సంస్థ ప్రస్తుత భవనం సరిపోనందున గతంలో ఉన్న టౌన్ హాల్ స్థానంలో బాలికలకు,బాలురకు వేరు వేరుగా ప్రత్యేకంగా ఫ్లోర్లు నిర్మించి అక్కడ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామని, ఇందుకు సంబంధించిన పూర్తి ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేయడం జరిగిందని కలెక్టర్ వెల్లడించారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు డాక్టర్ ఎం. ఆఫీస్ ఖాన్ మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞానాన్ని అందిస్తాయని, నల్గొండ జిల్లా కేంద్ర గ్రంథాలయ ప్రస్తుత భవనం సరిపోనందున కొత్త బిల్డింగ్ మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. జిల్లా గ్రంధాలయ సంస్థ సెక్రటరీ బాలమ్మ, బాలుర, బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్ సిబ్బంది, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్తినిలకు బహుమతులు అందజేశారు.



Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!