విద్యా, ఉద్యోగ మరియు రాజకీయ రంగాలలో 42 శాతం రిజర్వేషన్లు సాధించేవరకు ఈ పోరాటం ఆగదు.
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీల సత్తా చూపిస్తాం,
——చక్రహరి రామరాజు నల్లగొండ జిల్లా బీసీ జేఏసీ చైర్మన్

ఈరోజు నల్లగొండలో రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపుమేరకు ఎన్జీ కాలేజీ గ్రౌండ్లో ఉదయం ఏడు గంటలకు రన్ ఫర్ సోషల్ జస్టిస్ కార్యక్రమము నల్లగొండ బీసీ జేఏసీ జిల్లా జేఏసీ చైర్మన్ చక్రహరి రామరాజు ఆధ్వర్యంలో జరిగినది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తరతరాలుగా బీసీలు సామాజికంగా అన్ని రంగాలలో వివక్షతకు దోపిడీకి గురవుతూనే ఉన్నారని దేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు దాటిన నేటికీ బీసీల కు చట్టబద్ధమైన రిజర్వేషన్లు లేవు కేంద్రంలో ఒక మంత్రిత్వ శాఖ లేదు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు లేవు సమాజంలో అన్ని వర్గాలకు వారు వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను పొందుతున్నారు కానీ బీసీ లు మాత్రం వారి జనాభా దామాషా ప్రకారం ఏ రంగంలో కూడా వారి వాటా వారికి దక్కటం లేదు ఇది బీసీల పట్ల జరుగుతున్న తీరని అన్యాయము స్వతంత్ర భారతదేశంలో ఇదా సామాజిక న్యాయం అన్నారు బీసీలు ఇప్పటికైనా మేల్కొని ఐక్యంగా మన హక్కుల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు సామాజిక న్యాయం అంటే స్వతంత్ర భారతదేశంలో అన్ని వర్గాలకు వారి జనాభా దామాషా ప్రకారం విద్యా ఉద్యోగ రాజకీయ పారిశ్రామిక మిగతా అన్ని రంగాల్లో వారి వాటా వారికి దక్కాలి అది ఒక్క బీసీలకు మాత్రమే దట్టడం లేదు సామాజిక న్యాయం జరగటం లేదు ఈమధ్య రాష్ట్ర ప్రభుత్వం వారి ఇచ్చిన హామీ మేరకు కులగలను జరిపి బీసీలు రాష్ట్రంలో 56 శాతం ఉన్నారని తేల్చి వారి కేవలం 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతికి గవర్నర్ కి పంపిన వారి స్పందించలేదు రాష్ట్ర ప్రభుత్వం జీవో 9 తెచ్చి రిజర్వేషన్ అమలు చేయాలన్నప్పుడు కొంతమంది రిజర్వేషన్ ద్రోహులు కోర్టులను అడ్డం పెట్టుకొని రిజర్వేషన్ ను అడ్డుకున్నారు కోర్టు లు కూడా బీసీల పట్ల విభక్షత చూపుతున్నాయి రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అన్ని పార్టీలతో వెంటనే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వ దగ్గరకు వెళ్లి కొట్లాడి ఈ శీతాకాల సమావేశంలో పార్లమెంట్లో నైన్త్ షెడ్యూల్లో చేర్చి బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించి సామాజిక న్యాయం జరపాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఏ రాజకీయ పార్టీ బీసీలను మోసం చేస్తుందో రాబోయే రోజుల్లో వారికి సరి అయిన గుణపాఠం చెబుతామని హెచ్చరించినారు చివరిగా వారు బీసీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేసినారు. ఈ కార్యక్రమంలో శంకర్ ముదిరాజ్, కాసోజు విశ్వనాథం, నకరికంటి కాశయ్య గౌడ్, రాములు, జె ఇంద్రయ్య, కందిసూర్యనారాయణ, శ్యాంసుందర్, కేశవులు, వాడపల్లి సాయిబాబా, జెల్లా ఆదినారాయణ, వెంకటేశ్వర్లు పసుపులేటి సీతారాములు కొల్లోజు సత్యనారాయణ భాస్కర్, శంకరాచారి, శంకరాచారి, ఉద్యోగుల సంఘం సమీర్ శంకర్, మహిళా సంఘం మాధవి విద్యార్థి సంఘంమధు యాదవ్, కుల సంఘాల నాయకులు యువకులు విద్యార్థులు ఉద్యోగులు మహిళలు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments