42 శాతం రిజర్వేషన్లు అమలు అయ్యే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలి – చక్రహరి రామరాజు బీసీ జేఏసీ చైర్మన్

నల్లగొండ, నవంబర్ 13:
తెలంగాణ బీసీ జేఏసీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన “అష్టాంగ ఆందోళనలు” కార్యక్రమాలలో భాగంగా, ఈరోజు నల్లగొండలో NG కాలేజ్ సమీపంలో బీసీ ధర్మ పోరాట దీక్ష ఘనంగా జరిగింది. ఈ దీక్షను బీసీ జేఏసీ చైర్మన్ చక్రహరి రామరాజు ఆధ్వర్యంలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా రామరాజు గారు మాట్లాడుతూ,
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చొరవ తీసుకుని రాజ్యాంగబద్ధంగా బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.
రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, ఢిల్లీపై ఒత్తిడి తెచ్చే దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
అదేవిధంగా రాష్ట్రంలో ఎన్నికైన బీజేపీ ఎంపీలు బాధ్యత వహించి, పార్లమెంటులో చట్ట సవరణ చేయించేలా కృషి చేయాలని కోరారు.
రిజర్వేషన్లు అమలు అయిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో
తండు సైదులు గౌడ్, సుంకరి మల్లేష్ గౌడ్, పిల్లి రామరాజు యాదవ్, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ శంకర్ ముదిరాజ్, కోఆర్డినేటర్ నేలపట్ల సత్యనారాయణ, కో చైర్మన్‌లు కాసోజు విశ్వనాథం, నకిరేకంటి కాశయ్య గౌడ్, రాములు, జివాది ఇంద్రయ్య, పసుపులేటి సీతారాములు, గోకీ కార్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
బీసీ జేఏసీ ఆర్గనైజర్స్ గాంధారి వెంకటేశ్వర్లు, నల్ల సోమ మల్లన్న, సొల్లేటి రమేష్, శ్యాంసుందర్, బిక్షమయ్య నేత, జెల్లా ఆదినారాయణ, ఎల్లం రాజు, నల్ల మధు యాదవ్, చాగంటి రాములు, మల్లయ్య ముదిరాజ్, అలాగే గౌరవ సలహాదారులు కంది సూర్యనారాయణ, కొల్లోజు సత్యనారాయణ, గుంటోజు గోవర్ధన చారి తదితరులు హాజరయ్యారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments