నల్గొండ జిల్లా రీజియన్‌లో నడుస్తున్న ఆర్టీసీ అద్దె బస్సుల్లో సీట్ల పరిమితికి మించి ప్రయాణికులను అనుమతించడం వల్ల ప్రమాదాలు సంభవించిన సందర్భంలో ఇన్సూరెన్స్ వర్తించదని, దీనివల్ల డ్రైవర్లు మరియు బస్సు యజమానులు అనవసరంగా సమస్యలు ఎదుర్కొంటున్నారని, అద్దె బస్సుల ఓనర్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీసీ రీజినల్ మేనేజర్‌కు వినతిపత్రం సమర్పించారు.
అధ్యక్షుడు ఎం.డి. జలాల్ మాట్లాడుతూ:
అద్దె బస్సుల్లో సీట్ల పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లడం డ్రైవర్లు, కండక్టర్లు, ప్రయాణికుల ప్రాణాలకు ప్రమాదకరం. ఫుట్ బోర్డుపై ప్రయాణం చేయకుండా ఆపితే డ్రైవర్లను వేధించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అద్దె బస్సుల పర్మిట్‌ను ఆర్టీసీ సంస్థ తీసుకుంటుంది, అలాగే ఇన్సూరెన్స్ కూడా సీట్ల పరిమితిని బట్టి జరుగుతుంది. ప్రమాదం జరగినపుడు కండక్టర్‌పై కేసులు ఉండవు, కానీ డ్రైవర్లు మరియు బస్సు యజమానులపై కేసులు పడుతున్నాయి. ఇక గాయపడ్డ వారికి అయ్యే ఖర్చులు బస్సు బిల్లుల నుండి మినహాయించబడటం వలన యజమానులకు భారీ నష్టం జరుగుతోంది.
డిమాండ్
పర్మిట్, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌లో పేర్కొన్న సీట్ల సంఖ్యకు మించే ప్రయాణికులను అనుమతించకుండా ఆర్టీసీ సంస్థ కఠిన చర్యలు తీసుకోవాలి.
అలా అనుమతించినట్లయితే, దానికి ఆర్టీసీ సంస్థే బాధ్యత వహించాలి, అని అసోసియేషన్ డిమాండ్ చేసింది.
పాల్గొన్న వారు
ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు,
రాష్ట్ర కార్యదర్శి మదన్ రెడ్డి,
జిల్లా కార్యదర్శి జాకీర్ హుస్సేన్,
కార్యదర్శి నాగయ్య,
లింగస్వామి, హరిప్రసాద్, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments