e-paper
Thursday, January 29, 2026

అజ్జలాపురం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు క్రీడా దుస్తుల పంపిణీ – రొక్కం భాస్కర్‌రెడ్డి సహకారం

మారిగూడ మండలంలోని అజ్జలాపురం ప్రభుత్వ పాఠశాలలో శనివారం రోజున రొక్కం భాస్కర్‌రెడ్డి సహకారంతో, విక్టరీ యూత్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు టై, బెల్ట్, షూస్‌, ఐడీ కార్డ్‌, క్రీడా దుస్తులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ — “ప్రైవేట్ పాఠశాలలు అవసరం లేదు, ప్రభుత్వ పాఠశాలలే మనకు గర్వకారణం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఉపాధ్యాయ బృందం చేస్తున్న కృషి ప్రశంసనీయం” అని అన్నారు.

అలాగే విద్యా అభివృద్ధిలో తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పుల్లయ్య, ముద్దం శ్రీధర్, మేఘవత్‌ చందు నాయక్‌, వెంకటేశ్‌, కృష్ణ, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

⚡ ప్రధానాంశాలు

అజ్జలాపురం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు టై, బెల్ట్‌, షూస్‌, ఐడీ కార్డులు, క్రీడా దుస్తుల పంపిణీ

రొక్కం భాస్కర్‌రెడ్డి సహకారం, విక్టరీ యూత్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం

“ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలే మన బలం” — భాస్కర్‌రెడ్డి వ్యాఖ్యలు


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!