నల్లగొండ పట్టణ కేంద్రంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా సైకిల్ ర్యాలీ ఘనంగా నిర్వహించబడింది. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ గారు యన్.జి. కళాశాల నుండి ర్యాలీని ప్రారంభించి, స్వయంగా ర్యాలీలో పాల్గొన్నారు.
ర్యాలీ రామగిరి మీదుగా క్లాక్ టవర్ వరకు కొనసాగగా, పోలీసు సిబ్బంది, విద్యార్థులు, పట్టణ యువకులు పాల్గొని పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ —
“దేశ ప్రజల రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరవలేనివి. ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న ‘పోలీస్ ప్లాగ్ డే’ను జరుపుకుంటూ వారి సేవలను స్మరిస్తాం. వారోత్సవాల భాగంగా ఈ రోజు సైకిల్ ర్యాలీ నిర్వహించడం గర్వకారణం” అని పేర్కొన్నారు.
అతను ఇంకా తెలిపారు —
“జిల్లా పోలీస్ బలగం ప్రజా రక్షణనే ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని, రాత్రింబగళ్లు శాంతి భద్రతల పరిరక్షణలో కృషి చేస్తుంది. అమరవీరుల త్యాగాలు మనందరికీ ప్రేరణ” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, నల్లగొండ డిఎస్పీ శివరాం రెడ్డి, ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసులు, సిఐలు రాఘవరావు, రాజశేఖర్ రెడ్డి, మహాలక్ష్మయ్య, శ్రీనునాయక్, ఆర్‌ఐలు సంతోష్, శ్రీను, సూరప్ప నాయుడు, ఎస్సైలు సైదులు, శంకర్, గోపాల్ రావు, వీరబాబు, శ్రావణి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments