మిర్యాలగూడ, అక్టోబర్ 28:
రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మిర్యాలగూడ పట్టణ కేంద్రంలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ మరియు స్కాలర్‌షిప్‌లు తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం కేవలం రాజకీయాలకే పరిమితమై విద్యార్థుల సంక్షేమంపై చిత్తశుద్ధి చూపించడం లేదని విమర్శించారు. విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో చదువు మానుకోవాల్సిన పరిస్థితులు రాకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
జనార్దన్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వానికి క్రింది 12 ముఖ్యమైన డిమాండ్లు వినిపించారు:
1️⃣ గత రెండు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న SC/ST/BC/EBC/మైనారిటీ విద్యార్థుల ఫీజు బకాయిలు రూ.5 వేల కోట్లు వెంటనే చెల్లించాలి.
2️⃣ ఇంజినీరింగ్, పీజీ, డిగ్రీ, ఇంటర్ కోర్సులు చదివే BC/EBC విద్యార్థుల పూర్తి ఫీజులు మంజూరు చేయాలి.
3️⃣ కాలేజీ హాస్టల్ మెస్ చార్జీలు నెలకు ₹1500 నుండి ₹3000కు, పాఠశాల హాస్టల్ చార్జీలు ₹1100 నుండి ₹2000కు పెంచాలి.
4️⃣ ప్రతి కాలేజీ విద్యార్థికి ఏటా ₹20,000 స్కాలర్‌షిప్ మంజూరు చేయాలి.
5️⃣ బీసీల జనాభా ప్రాతిపదికన 120 కొత్త బీసీ గురుకుల పాఠశాలలు మరియు 50 డిగ్రీ కాలేజీలు స్థాపించాలి.
6️⃣ SC/ST/BC విద్యార్థుల కోసం 300 కొత్త కాలేజీ హాస్టళ్లు ప్రారంభించాలి.
7️⃣ విదేశీ విద్యార్థులందరికీ “స్టై ఫండ్” మంజూరు చేయాలి.
8️⃣ బీసీ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలకు స్వంత భవనాలు నిర్మించాలి.
9️⃣ IIT, IIM కోర్సులు చదివే విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వర్తింపజేయాలి.
10️⃣ బీసీ స్టడీ సర్కిల్ బడ్జెట్‌ను ₹200 కోట్లకు పెంచాలి.
11️⃣ రూ.20 వేల కోట్లతో బీసీ సబ్-ప్లాన్ ఏర్పాటు చేయాలి.
12️⃣ జూనియర్ అడ్వకేట్ల స్టై ఫండ్ను ₹1000 నుండి ₹10,000కు పెంచాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా నాయకుడు అనంత నాగరాజ్ గౌడ్, విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకుడు గాధగోని మహేష్ గౌడ్, సురేష్, గణేష్, నాగేందర్, మహేందర్, పృథ్వీరాజ్, యాదవ్, సుంకరబోయిన మల్లేష్ యాదవ్, జక్కల సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments