నల్లగొండ: నల్లగొండ జిల్లా పోలీసులు రామవత్ బాలాజీ నాయక్ను అరెస్ట్ చేశారు. ఇతను, పలుగు తండా, వడ్డి పట్ల గ్రామం, పి. ఏ. పల్లి మండల్ నివాసి, జవహర్ లాల్ కుమారుడు, వయసు 26, రియల్ ఎస్టేట్ వ్యాపారి, సుమారు 50 కోట్ల రూపాయల మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు.
బాలాజీ నాయక్ తన ఏజెంట్ల ద్వారా అమాయకుల వద్ద అధిక వడ్డీ ఆశ చూపి డబ్బులు వసూలు చేశాడు. 2019లో డిగ్రీ ఫెయిల్ అయిన తర్వాత 2020లో ఐస్ క్రీమ్ పార్లర్ వ్యాపారం కోసం ₹5 లక్షలు 2% వడ్డీకి తీసుకుని నష్టపోయాడు. తరువాత రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ₹6–10 రేట్ల వడ్డీ ఇచ్చి నమ్మించి, పలుగు తండా మరియు చుట్టుపక్కల గిరిజన తండాల నుండి victims నుండి డబ్బులు సేకరించాడు.
బాధితుల నుండి వసూలు చేసిన డబ్బులతో విలాసవంతమైన జీవనశైలి చూపుతూ పోర్ష్, స్కార్పియో కార్లు, విల్లు, బైక్స్, వ్యవసాయ భూములు కొనుగోలు చేశాడు. ఇతను నెలకు వడ్డీ చెల్లించేలా చూపిస్తూ, పాత ప్రామిసరీ నోట్లను మార్చి కొత్త నోట్లతో భాధితులను మోసపెట్టాడు. అదనంగా స్టాక్ మార్కెట్, సాఫ్ట్‌వేర్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టి, లికర్ లైసెన్స్‌లు కొని డబ్బులు నష్టం చేశారు.
పోలీసుల విచారణలో 106 మంది బాధితులు ఈ మోసానికి గురైనట్టు గుర్తించారు. బాలాజీ నాయక్ మరియు అతని బీనామీ ఆస్తులను పోలీసులు గుర్తించి ప్రభుత్వ ద్వారా జప్తు చేసి, కోర్టు ద్వారా బాధితులకు రికవరీ చేయనున్నట్లు తెలిపారు.
కేసులు:
• Cr.No 153/2025 u/s 316(2), 318(4) BNS, Section 5 of TS Protection of Depositors of Financial Establishments Act, 1999 – గుడిపల్లి పోలీస్ స్టేషన్
• Cr.No 154/2025 u/s 316(2), 318(4) BNS, Section 5 of TS Protection of Depositors of Financial Establishments Act, 1999 – గుడిపల్లి పోలీస్ స్టేషన్
• Cr.No 157/2025 u/s 316(2), 318(4) BNS, Section 5 of TS Protection of Depositors of Financial Establishments Act, 1999 – గుడిపల్లి పోలీస్ స్టేషన్
జిల్లా ఎస్. పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ బాధితులను అలజడి, వత్తిడికి లోనవ్వకుండా నేరుగా పోలీస్ వారితో సంప్రదించి కేసులు నమోదు చేసుకోవాలని, మద్యవర్తులు లేదా మోసపూరిత వాగ్ధానాలను నమ్మవద్దని సూచించారు.

Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments