నల్లగొండ, నవంబర్ 4:
“42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితి” రాష్ట్ర కమిటీ ఉద్యమ కార్యాచరణలో భాగంగా నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధీక్షా చేపట్టారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్‌కు ఇంటెలెక్ట్యువల్ ఫోరమ్ జిల్లా కోఆర్డినేటర్ నేలపట్ల చంద్రశేఖర్ నేతృత్వంలో డిమాండ్లతో కూడిన మెమోరాండం సమర్పించారు.
ప్రసంగిస్తూ నాయకులు పేర్కొన్నదేమిటంటే — రాష్ట్ర ప్రభుత్వం బిల్ నంబర్లు 3 మరియు 4 ద్వారా విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్‌ను 42 శాతానికి పెంచుతూ మార్చి 2025లో ఆమోదించినప్పటికీ, గవర్నర్ ఆమోదం అనంతరం కేంద్రానికి పంపిన ఈ బిల్లులు ఇప్పటివరకు తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడానికి పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి, కేంద్రంపై ఒత్తిడి పెంచి 9వ షెడ్యూల్ అమలుకు చర్యలు చేపట్టాలని వారు కోరారు. అలాగే రాబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లులను తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
42 శాతం రిజర్వేషన్లలో ఉపవర్గీకరణ (Sub-categorisation) చేసి అత్యంత వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయం జరిగేలా చూడాలని కూడా వారు సూచించారు.
అదే విధంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ప్రభుత్వం ప్రతి సంవత్సరం ₹20,000 కోట్ల బీసీ సబ్ ప్లాన్‌ను అమలు చేస్తామని చెప్పినా, గత ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన ₹9,200 కోట్లలో కేవలం ₹2,068 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సంవత్సరం కూడా పరిస్థితి మారలేదని, కాబట్టి బీసీల విద్య, ఉపాధి, ఆర్థిక అభివృద్ధి కోసం మొత్తం ₹40,000 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే రాష్ట్రంలోని నామినేటెడ్ పోస్టులు, కమిషన్లు, బోర్డులు మరియు సలహా మండళ్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 42 శాతం ప్రాతినిధ్యం ఇవ్వాలని కూడా కోరారు.
ఈ కార్యక్రమంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సమితి, బీసీ–ఎస్సీ–ఎస్టీ జేఏసీ జిల్లా కోఆర్డినేటర్ తలారి రాంబాబు, జేఏసీ నాయకులు నామాల నర్సింహ్మ, నేలపట్ల రఘునందన్, జగన్, శ్రీను, శంకర్, వంశీ, వినోద్, లింగయ్య, రవి, పరమేష్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments