హైదరాబాద్‌లో నిర్వహించిన హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ – హిస్ఎఫ్‌ఎఫ్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్‌కు, తెలంగాణకు ఈ ఫెస్టివల్ ఒక మంచి ఆరంభమని అన్నారు.

యువ ఫిల్మ్‌మేకర్స్‌కు షార్ట్ ఫిల్మ్స్ స్వేచ్ఛను, సృజనాత్మకతను ఇస్తాయని, కొత్త ఆలోచనలు వెలుగులోకి రావడానికి ఇలాంటి వేదికలు అవసరమని తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం సినిమా రంగానికి పూర్తి మద్దతు ఇస్తోందని అన్నారు. మంచి ప్రతిభకు అవకాశాలు కల్పించడం, యువ ఫిల్మ్‌మేకర్స్‌కు సరైన వేదికలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
తెలంగాణను దేశంలోనే ఫిల్మ్‌మేకర్స్‌కు ఉత్తమ రాష్ట్రంగా మార్చడమే లక్ష్యమని పేర్కొంటూ, షూటింగ్ అనుమతులను సులభతరం చేయడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం దిశగా ప్రభుత్వం సీరియస్‌గా పనిచేస్తోందని తెలిపారు.
ఈ ఫెస్టివల్‌లో నార్త్ ఈస్ట్ రాష్ట్రాల ఫిల్మ్‌మేకర్స్ పాల్గొనడం ప్రత్యేకతగా నిలిచిందని, ఇలాంటి కార్యక్రమాలు దేశాన్ని మరింత దగ్గర చేస్తాయని అన్నారు.
అవార్డు వచ్చినా రాకపోయినా ప్రతి కథకు విలువ ఉందని, కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలని యువ ఫిల్మ్‌మేకర్స్‌ను ప్రోత్సహించారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments