ePaper
Monday, March 2, 2026

శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం వైభవంగా నిర్వహణ

శ్రీ శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం ఆధ్వర్యంలో, జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డుపై ఉన్న శ్రీ వెంకటేశ్వర కాలనీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు శ్రీ స్వామివారి కళ్యాణం అత్యంత ఘనంగా నిర్వహించారు.

ఆలయంలోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నాదాల మధ్య, భక్తుల గోవింద నామ స్మరణలతో అర్చక స్వాములు కళ్యాణ తంతును శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉత్సవ మూర్తులను పట్టు వస్త్రాలు, ఆభరణాలతో దివ్యంగా అలంకరించి కళ్యాణ వేదికపై అధిష్ఠింపజేశారు.

తదుపరి గణపతి పూజ, పుణ్యాహవాచనం, అనంతరం రక్షాబంధనం, పాదప్రక్షాళన, జీలకర్ర–బెల్లం పరువులు తదితర కళ్యాణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కళ్యాణాన్ని ఆలయ అర్చకులు శ్రీ పవన్ శర్మ, శ్రీ సుబ్రమణ్య శాస్త్రీ, శ్రీ సాయి శర్మ, శ్రీ దివాకర్ శర్మ లు నిర్వహించారు.

స్వామివారి కళ్యాణాన్ని దర్శించేందుకు కాలనీ వాసులు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో హాజరై పరవశించారు. అనంతరం పూర్ణాహుతి, అన్నసంతర్పణ కార్యక్రమాలు నిర్వహించగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. వేద పండితులను ఆలయ మర్యాదలతో సత్కరించి, భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్ష, కార్యదర్శులు శ్రీ వేనేపల్లి లక్ష్మణ్ రావు, కాశవజ్ఞుల నరసింహమూర్తి, అలాగే రావిరాల వెంకటేశ్వర్లు, పారేపల్లి పురుషోత్తం, గౌరు గోపాలకృష్ణమూర్తి, మేడం ప్రభాకర్, నూకల జయపాల్ రెడ్డి, చల్లా లింగారెడ్డి, నాగులపల్లి శ్యాంసుందర్, గిరిజా కుమారి, జానకి, విజయమ్మ, జ్యోతి, పుష్ప, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!