
జిల్లాలోన బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో విద్యార్థుల సంక్షేమం కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు వివరించారు. ఇటీవల పాఠశాలల యాజమాన్యాలతో సమావేశమై, వారి సమస్యలను తెలుసుకొని పరిష్కార చర్యలు చేపట్టామని కలెక్టర్ తెలిపారు.
హైదరాబాద్ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్
మంగళవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎస్సీ-ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి ఆడ్లూరు లక్ష్మణ్ కుమార్‌తో కలిసి బెస్ట్ అవైలబుల్ పాఠశాలల సమస్యలపై జిల్లా కలెక్టర్లు, సంక్షేమ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు:
ప్రజా ప్రభుత్వం విద్యారంగంపై విశేష దృష్టి పెట్టిందని చెప్పారు. బెస్ట్ అవైలబుల్ స్కీం కింద పాఠశాలలు, జిల్లా యంత్రాంగం మధ్య ఒప్పందానికి విరుద్ధంగా విద్యార్థులను బయటికి పంపకూడదని స్పష్టం చేశారు. విద్యా హక్కు చట్టం, ఒప్పంద వివరాలను పాఠశాల యాజమాన్యాలకు సమగ్రంగా వివరించాలని కలెక్టర్లకు ఆదేశించారు. బకాయి బిల్లుల వివరాలు వెంటనే పంపించాలని సూచించారు. కొంత మొత్తం త్వరలోనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.
జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు:
స్థానిక సంస్థల ఇంఛార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, గిరిజన సంక్షేమ అధికారి చత్రునాయక్, మైనార్టీ సంక్షేమ అధికారి విజయేందర్ రెడ్డి, ఎస్సీ సంక్షేమ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments